సికింద్రాబాద్ రామ్గోపాల్పేట్లో తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను నిరసిస్తూ భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. సాటిలైట్ కూడలి వద్ద భాజపా నాయకులు తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రామమందిర నిర్మాణం చారిత్రాత్మక ఘట్టమని, దేవాలయం విషయంలో కూడా తెరాస నాయకులు రాజకీయం చేయడం దారుణమన్నారు. వెంటనే విద్యాసాగర్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ఇదీ చదవండి: తుది అంకానికి యాదాద్రి పనులు.. త్వరలోనే పునః ప్రారంభం!