ETV Bharat / state

శివాజీ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు

జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా బోరబండ బస్టాప్​ వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న భాజపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

bjp protest at borabanda in hyderabad
శివాజీ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Feb 10, 2021, 2:29 PM IST

హైదరాబాద్​లోని బోరబండ బస్టాప్​ వద్ద భాజపా కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు యత్నించారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భాజపా నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో అడిషనల్ ఐజీ ఏఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ఏసీపీలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకున్నామని.. అయినా పోలీసులు అడ్డుకుంటున్నారని భాజపా నాయకుడు శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు.

ఇదీ చదవండి: నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.