కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తెరాసలో పెద్ద బాంబు పేలుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం కాదు.. ఎన్నికలకు వెళ్తే ప్రజలే నిర్ణయిస్తారన్నారు. బండి సంజయ్‌ని బ్రాహ్మణ, వైశ్య, వెలమ, రెడ్డి సంఘాలు ఘనంగా సన్మానించాయి. వేద పండితులు బండి సంజయ్‌ని ఆశీర్వదించారు.
పేదరికం విద్య, ఉద్యోగాల్లో అడ్డుకాకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టం తీసుకువచ్చారన్నారని సంజయ్ తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేయాలంటూ భాజపా పోరాటానికి పూనుకున్న విషయం.. నిఘా విభాగాల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలోనూ అమలు చేస్తానని ప్రకటించారన్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా పీఆర్సీ, రిజర్వేషన్లు అమలు చేయాలని లేనిపక్షంలో మెడలు వంచి అమలు చేయిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరుతో అగ్రవర్ణాల్లోని పేదలు నష్టపోయారు: బండి