BJP Deeksha: శాసనసభ నుంచి తమను సస్పెండ్ చేసిన అంశంలో హైకోర్టు సూచనను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించడాన్ని నిరసిస్తూ భాజపా ఎమ్మెల్యేలు చేపట్టిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ముగిసింది. ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ వద్ద భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌తో పాటు ఆ పార్టీ నేతలు దీక్షకు దిగారు. ఎమ్మెల్యేల దీక్ష నేపథ్యంలో పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు దీక్షలో పాల్గొన్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యేలు తమను సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్‌తో పాటు ప్రభుత్వంపై మండిపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుల్డోజర్ల కోసం ఆర్డర్ చేశారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లను ఎక్కిస్తామంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దుర్మార్గపు ఆలోచనతోనే..
తెలంగాణ ఉద్యమంలో సీఎంతో పాటు అడుగులో అడుగు వేసిన ఉద్యమ బిడ్డ అయిన తనను కుట్రతో, దుర్మార్గపు ఆలోచనతో పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో తాను ఓడిపోవాలని, ప్రశ్నించే గొంతు ఆగిపోవాలని అక్రమంగా సంపాదించిన రూ.వందల కోట్లను ఖర్చు చేశారని ఆరోపించారు.
కుట్రలో భాగంగానే..
ప్రభుత్వ కుట్రలో భాగంగానే స్పీకర్ తమను సస్పెండ్ చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: