భాజపా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి నలుగురు అభ్యర్థులతో.. జాబితా విడుదల చేసింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సరోయ, యూపీ నుంచి మిథిలేష్ కుమార్, కె.లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది.
వచ్చే ఏడాది జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దిగువ సభలో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉండగా.. ఎగువసభలో రాష్ట్ర విషయాలు వచ్చినప్పుడు పార్టీ నుంచి మాట్లాడేవారు కరవయ్యారు. ఆ లోటును భర్తీ చేయడంతో పాటు.. తెలంగాణలోని బలమైన మున్నూరు కాపు, మొత్తం ఓబీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు.. భాజపా ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. నామినేషన్ల దాఖలుకు నేడు చివరి రోజు కాగా.. నేడు ఉదయం లక్ష్మణ్ లఖ్‌నవూ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు.
ఇవీ చూడండి..
రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా.. నిర్మల, పీయూష్‌కు ఛాన్స్