ఆరేళ్లల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్ర సేనారెడ్డి డిమాండ్ చేశారు. దుబ్బాకలో మీటింగ్ పెట్టే ధైర్యం లేకనే ధరణి, రైతు వేదికల పేరుతో సమావేశాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో తెరాస గెలుపుపై మంత్రి హరీశ్ రావుకు ఆశలు సన్నగిల్లాయనడానికి... రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్న ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
సభ్యత సంస్కారం గురించి మాట్లాడే కేటీఆర్... ముందు తన తండ్రికి సంస్కారం నేర్పించాలన్నారు. మక్కలు కొనడానికి కూడా కేంద్రమే నిధులిస్తోందని ఇంద్ర సేనారెడ్డి తెలిపారు. కేంద్రం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తుందన్నారు. గొల్ల కుర్మలను సీఎం కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు.
ఇదీ చదవండి: రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : సీఎం కేసీఆర్