ETV Bharat / state

DK ARUNA on TRS: కుట్ర పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు: డీకే అరుణ - మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై డీకే అరుణ

DK ARUNA on TRS: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర జరిగిందని తెరాస నాయకులు నాటకాలు ఆడుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి హత్యకు కుట్ర జరిగిందని అనడం అంతా కట్టుకథేనని కొట్టిపారేశారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

DK ARUNA on TRS
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
author img

By

Published : Mar 3, 2022, 4:40 PM IST

DK ARUNA on TRS: మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై హత్యకు కుట్ర పన్నారంటూ సైబరాబాద్ పోలీసులు మహబూబ్​నగర్ యువకులపై తప్పుడు కేసులు బనాయించారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆమె ధ్వజమెత్తారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని... ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ఆఫిడవిట్ సమర్పించాడని కొందరు వ్యక్తులు ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారన్నారు. సామాజిక మాధ్యమాలు వేదికగా.. మంత్రి అవినీతి, కబ్జాలపై ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇది తట్టుకోలేక మంత్రి వారిపై కక్షగట్టి కిడ్నాప్‌ కూడా చేయించినట్టు తెలిపారు. మహబూబ్‌నగర్‌ ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మంత్రి శ్రీనివాస్ గౌడ్​ హత్యకు కుట్రపై సీబీఐ విచారణ జరిగాల్సిందేనని డీకే అరుణ డిమాండ్ చేశారు. గత నెల 23 నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఎన్నికల వేళ తన అఫిడవిట్‌ను ట్యాంపర్‌ చేశారని గత నెల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై రాఘవేందర్‌రావు పిటిషన్‌ వేశారని తెలిపారు. గత నెల 23న రాఘవేందర్‌రావు తమ్ముడు నాగరాజును కిడ్నాప్‌ చేశారని వెల్లడించారు. మంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని యాదయ్యపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. గత నెల 24న యాదయ్యను కూడా కిడ్నాప్‌ చేశారని తెలిపారు.

సైబారాబాద్​ సీపీ కథ చదివారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పులిలా రెచ్చిపోయిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక కొత్త కోణాన్ని బయటకు తీశారని ఆరోపించారు. ఆయన చెప్పిన ప్రతి లైన్, కథ, స్క్రీన్ ప్లే తుగ్లక్ రోడ్డు నుంచి వచ్చాయని స్పష్టంగా అర్థమవుతోందని మండిపడ్డారు. సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియా సమావేశం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. ఈ కుట్రలో మొదటి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

తెరమీదకు కొత్త వివాదం

మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై హత్యకు కుట్ర అనే కొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చారని డీకే అరుణ విమర్శించారు. పోలీసులకు ఫోన్లు ఏ ఒక్కరూ కూడా స్పందించలేదని ఆమె ఆరోపించారు. మహబూబ్ నగర్ డీఎస్పీకి కాల్ చేస్తే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నారు. ఎస్పీకి కాల్ చేస్తే ఆయన స్పందించలేదని... సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ చేసినా ఎవరూ ఏమీ తెలియదన్నారని తెలిపారు.

ఎఫ్​ఐఆర్​ ఓ కట్టుకథ

ఎఫ్​ఐఆర్ అంతా ఒక కట్టు కథలాగా అనిపించిందని డీకే అరుణ తెలిపారు. ఇదంతా చూస్తుంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిజంగానే ఎలక్షన్ అఫిడవిట్​ను మరోసారి అప్​లోడ్​ చేశారని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మంత్రిని చూసి భయపడే అవసరం తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. భాజపాని ఎదుర్కోవడానికి ఇలాంటి దాడులు చేయాలని పీకే సలహా ఇచ్చాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటే తెలంగాణ ప్రజలే పీకేను పీకేస్తారని హెచ్చరించారు. బెంగాల్​లో జరిగినట్లు ఇక్కడ చేస్తామంటే కుదరదన్నారు. పీకే వచ్చింది నిన్ను పీకేయడానికేనని సీఎం కేసీఆర్ గుర్తుపెటుకోవాలని అన్నారు.

'లోకల్​లో ఉన్నవారు ఎవరైనా ఎలక్షన్​ పిటిషన్ వేస్తే దాన్ని ఎదుర్కోవాలి మంత్రిగారు. ఎలక్షన్ పిటిషన్లు ఎప్పుడైనా వచ్చాయా? ఆయనకు ఎందుకంత భయం? దీనిపై మాకు ఏం అనుమానం వస్తుందంటే మంత్రిగారే నిజంగా ఎలక్షన్ అఫిడవిట్​ను ట్యాంపరింగ్ చేశారేమో? అందుకే ఇంత భయపడుతున్నాడేమో? వారి కుటుంబంపై కేసులు పెట్టి అరెస్టులు చేయించాల్సిన అవసరమేముంది? అన్యాయంగా కేసులు పెట్టి ఆడవాళ్ల ఉసురు పోసుకోవద్దు. కేసీఆర్​కు దమ్ముంటే సీబీఐ దర్యాప్తు జరపాలి. శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే ఉద్యమ నాయకుడా.. ఈటల కాదా? తప్పుడు నాయకులకు ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు ఎలా తెలుపుతారు. కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా గొంతెత్తని ఉద్యోగ సంఘాలు ఇప్పుడేందుకు గొంతెత్తుతున్నాయి. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. పీకే చెప్పిండంట కేసీఆర్​ ఓడిపోడితాడని. ప్రధానమంత్రిని తిడితే జాతీయ నాయకుడు అవుతాడని చెప్పిండంటా. ఆ పీకే నిన్ను పీకేయడానికే వచ్చిండు. గుర్తు పెట్టుకో కేసీఆర్.

- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.