గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి-రాచరికానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్ భూపేంద్రయాదవ్ అన్నారు. అబద్ధాలు చెప్పటంలో మంత్రి కేటీఆర్‌ను మించిన వాళ్లు లేరన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు నివాసానికి అల్పాహార విందుకు భూపేంద్రయాదవ్ హాజరయ్యారు. తెరాస ప్రభుత్వ అవినీతిపై భాజపా పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. భూపేంద్రయాదవ్‌తో తనకు అనుబంధం ఉందని... జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్‌గా రావడం వల్ల అల్పాహార విందుకు ఆహ్వానించినట్లు గరికపాటి మెహన్రావు తెలిపారు.
- ఇదీ చదవండి: నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ