ETV Bharat / state

'శాసనసభలో తీర్మానం చేసినంత మాత్రాన సీఏఏ ఆగదు' - భాజపా

అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించడంపై భాజపా ఎంపీలు మండిపడ్డారు. శాసనసభలో తీర్మానం చేసినంత మాత్రాన సీఏఏ ఆగబోదని స్పష్టం చేశారు. కేవలం మజ్లిస్‌ను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి ఇలా చేశారని ఆరోపించారు.

bjp-mps-bandi-sanjay-and-arvind-bapurao-are-fire-on-cm-kcr-for-ts-assembly-approves-anti-caa-resolution
'శాసనసభలో తీర్మానం చేసినంత మాత్రాన సీఏఏ ఆగదు'
author img

By

Published : Mar 16, 2020, 7:36 PM IST

'శాసనసభలో తీర్మానం చేసినంత మాత్రాన సీఏఏ ఆగదు'

సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఆమోదించడంపై భాజపా రాష్ట్ర ఎంపీలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు అవగాహన లేక సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​సీఆర్​లను వ్యతిరేకిస్తున్నారని ఎంపీలు బండి సంజయ్​, అర్వింద్​, సోయం బాపురావు పేర్కొన్నారు.

శాసనసభలో తీర్మానం చేసినంత మాత్రాన సీఏఏ ఆగబోదని స్పష్టం చేశారు. కేవలం మజ్లిస్‌ను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. సీఏఏ వల్ల ఎవరికీ నష్టం ఉండదన్న ఎంపీలు.. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని శాసనసభ ఎలా వ్యతిరేకిస్తుందన్నారు. బర్త్ సర్టిఫికెట్ లేదంటున్న కేసీఆర్.. ఇన్నాళ్లు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తూ వస్తున్నారని ప్రశ్నించారు.

ఇదీ చూడండి : సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.