కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ.. 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయమని.. ఇది చాలా సంక్లిష్టమైనదని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. దేనికి ఎప్పుడు ఏ ఫారం పూర్తి చేయాలో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2030 నాటికి భారతదేశం ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది అనే అంశంపై ప్రసంగించారు.
2030 కల్లా మన దేశం ఆర్థికంగా మరింత బలపడాలంటే ఏటా పది శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్లాల్సి ఉందని వివరించారు. దేశంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.