ETV Bharat / state

Laxman fires on KTR : 'దమ్ముంటే ఆ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయండి'

Laxman Fires on Minister KTR : అవినీతి, కుటుంబ పార్టీలు మోదీనీ ఏమీ చేయలేవని.. మరోసారి మోదీ సర్కారే వచ్చేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. లక్షా 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న కేటీఆర్... శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వందల ఎకరాల భూములను కారు చౌకగా అస్మదీయులకు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Laxman
Laxman
author img

By

Published : Jun 7, 2023, 8:46 PM IST

MP Laxman Fires on KTR : మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. లక్షా 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న కేటీఆర్... శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా ధనంతో విదేశీ పర్యటనలు చేశారు కానీ... టీఎస్ఐపాస్ ద్వారా ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పాలన్నారు. వందల ఎకరాల భూములను కారు చౌకగా అస్మదీయులకు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతుకమ్మ చీరలు కూడా గుజరాత్ నుంచి తెప్పించారు : ప్రభుత్వం జారీ చేసే జీవోలు ఎందుకు వెబ్​సైట్​లో పెట్టడంలేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎందుకంత పారదర్శకత లేకుండా భయపడుతున్నారని నిలదీశారు. ఇంటింటికి ఫైబర్ అన్నారు... ఏమైంది ఐదేళ్లయినా ఊసే లేదని ఆయన విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల గ్రామాల్లో ఉన్నట్టుగా కూడా ఇంటర్నెట్ తెలంగాణలో లేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు కూడా గుజరాత్ నుంచి తెప్పించారు తప్పితే... ఇక్కడ చేనేత కార్మికులకు ఉపాధి కూడా ఇవ్వలేకపోయారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. మోదీ సర్కారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించందని... తమరేం చేశారో చెప్పాలని బీఆర్​ఎస్ నేతలకు లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చారు... ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్న అంశాలపై దమ్ముంటే శ్వేత పత్రం ఇవ్వాలన్నారు.

'60 ఏళ్లల్లో జరగని అభివృద్ధి ఈ 9 ఏళ్లల్లో జరిగింది. ఇవాళ మన దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. మౌలిక సదుపాయాల కల్పనపై మోదీ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 7.1 శాతం వృద్ధిరేటుతో భారత్ వేగంగా ఎదుగుతోంది. లక్షా 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి.'- లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు

అవినీతి, కుటుంబ పార్టీలు మోదీనీ ఏమీ చెయ్యలేవు : డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే మరింత న్యాయం తెలంగాణకు జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలు మోదీనీ ఏమీ చెయ్యలేవని.. మరోసారి మోదీ సర్కారే వచ్చేదని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. బీసీల ఫెడరేషన్​కు డబ్బు లేదు, కార్పొరేషన్​కు నిధులు లేవు... కానీ, ఇప్పుడు కేసీఆర్ మరో కొత్త పథకానికి తెరతీశారని ఆయన మండిపడ్డారు. చేతి వృత్తులు, కుల వృత్తుల వారిని లక్ష రూపాయలు ఆర్థికసాయం అనే పేరుతో సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.