MP Laxman Fires On KCR: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు . తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడేందుకు.. కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి చీకట్లు తొలగాలంటే.. కమలం వికసించాలని స్పష్టం చేశారు. బడ్జెట్ కల్వకుంట్ల కుటుంబానికి.. కష్టాలు ప్రజలకు అని విమర్శించారు. మోదీ సంక్షేమ పథకాలను వివరిస్తూనే... కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడతామని అన్నారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లే గెలుపే లక్ష్యంగా.. మిషన్ -90 నినాదంతో ముందుకెళ్తామని ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. రెండురోజుల విస్తారక్‌ల సమావేశం వేదికగా.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. అసెంబ్లీ నియజకవర్గంలో నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించారు. జనవరి 20 నుంచి.. ఫిబ్రవరి 5 వరకు గ్రామాల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు.
తమ పదవుల కోసం కాదు: ఫిబ్రవరి 15నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు.. మార్చిలో జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తామని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. ఏప్రిల్‌లో కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ తయారు చేసి.. బహిరంగ సభలో విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతి నగరంలో మేధావులతో సభలు, సమ్మేళనాలు నిర్వహిస్తామని అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారాన్ని కోరుకునేది తమ పదవుల కోసం కాదని.. ప్రజల కష్టాలను తీర్చేందుకేనని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.
కల్వకుంట్ల కుటుంబం నుంచి చీకట్లు తొలగాలంటే.. కమలం వికసించాలి. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా నాయకులను, కార్యకర్తలను తయారు చేయాలనే లక్ష్యంతో రెండు రోజులు సమావేశాల్లో వివరించారు. బడ్జెట్ కల్వకుంట్ల కుటుంబానికి.. కష్టాలు ప్రజలకు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లే గెలుపే లక్ష్యంగా.. మిషన్ -90 నినాదంతో ముందుకెళ్తాం. - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
ఇవీ చదవండి: రూ.500 కోట్ల సర్కారు స్థలం కబ్జా.. 60 గజాల ప్లాట్లుగా మార్చి అమ్మకం
'ఇండియా ఫస్ట్'.. తల్లి మరణించిన బాధలోనూ కర్తవ్యాన్ని మరవని మోదీ