ETV Bharat / state

తెరాసలో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌ - హైదరాబాద్ తాజా వార్తలు

bjp mp laxman: జాతీయ పార్టీ అని సీఎం కేసీఆర్ పగటి కలుల కంటున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి కేసీఆర్​ లేదన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

లక్ష్మణ్‌
లక్ష్మణ్‌
author img

By

Published : Jul 8, 2022, 7:30 PM IST

bjp mp laxman: తెరాసలో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని.. తెరాస కట్టప్పల విషయంలో భాజపాది ప్రేక్షకపాత్ర మాత్రమేనని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ అని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి సీఎం కేసీఆర్‌కు లేదని.. తెరాస, కాంగ్రెస్‌, ఎంఐఎంకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా దిల్లీలో తెలంగాణ భాజపా నేతలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భాజపాలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరిక ట్రైలర్‌ మాత్రమేనని.. సినిమా ముందుందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని వెల్లడించారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి కృషి చేస్తున్నారని లక్ష్మణ్ తెలియచేశారు. అనంతరం లక్ష్మణ్​ను తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నేతలు ఘనంగా సత్కరించారు.

"తెరాసలో కట్టప్పలు తయారుగా ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వారు ముందుకొస్తున్నారు. భాజపాలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరిక ట్రైలర్‌ మాత్రమే. అసలు సినిమా ముందుంది. బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం." - డాక్టర్ కె.లక్ష్మణ్‌, భాజపా రాజ్యసభ సభ్యుడు

తెరాసలో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

ఇదీ చదవండి: 'దేశానికి రాహుల్​ను ప్రధానిని చేసినప్పుడే వైఎస్సార్​ ఆత్మకు శాంతి..'

ద్రౌపది కోసం భాజపా పక్కా ప్లాన్.. రెండు రోజులు ముందే దిల్లీకి ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.