BJP MP Dr. K Laxman Interview : గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ, అమిత్ షా, నడ్డా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నారని.. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని ఆ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మోదీపై ప్రజలకు అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువతకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలే : లక్ష్మణ్
Telangana Assembly elections 2023 : కాంగ్రెస్ బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసీ రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని.. కేసీఆర్ అబద్ధపు మాటలు, వాగ్ధానాలు విని విని ప్రజలు విసిగిపోయారని అన్నారు. వేలం పాట మాదిరిగా పోటీ పడి బీఆర్ఎస్, కాంగ్రెస్ పథకాలను ప్రకటిస్తున్నారని విమర్శించారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంభందించిన ఆమోదయోగ్యమైన హామీలనే బీజేపీ ఇచ్చిందని చెప్పారు. అప్పుల కుప్పగా మారిన తెలంగాణ అదోగతి పాలు కావద్దంటే బీజేపీకు ఓటు వేయాలని చెప్పారు.
‘‘రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ 60 సీట్లు రాలేదు. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ సీట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’’ -లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు
BJP MP Dr K Laxman Campaign : కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజల సొమ్ముతో తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు ఇస్తున్నారని.. కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్కు ఏటీఏంగా మారిందని అన్నారు. బీజేపీకు ఓటు వేయాలని బీసీలు, ఎస్సీలు, మహిళలు నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రజల నుంచి టాటా కాంగ్రెస్.. బై బై బీఆర్ఎస్.. వెల్కమ్ బీజేపీ నినాదాలు వినిపిస్తున్నాయని తెలియజేశారు. కారు షెడ్డుకు పోతుంది.. కమలం వికసిస్తుందని అన్నారు. చరిత్రలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు 60 సీట్లు దాటిన దాఖలాలు లేవని విమర్శించారు.
ఇప్పుడు 60 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మోదీ మూడు రోజుల పర్యటన పార్టీ విజయానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రలోభాల మీదనే ఆధారపడ్డాయి తప్పితే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని తెలియజేశారు. కేసీఆర్ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి హామీలు ఇవ్వడం సిగ్గు చేటని విమర్శించారు. ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పార్టీల గుర్తింపును రద్దు చేయాలని అన్నారు.
తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు : ఎంపీ లక్ష్మణ్
'ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం వచ్చింది'