MP Dharmapuri arvind comments On CM KCR: ఉప్పుడు బియ్యాన్ని క్రమంగా తగ్గించాలని నాలుగేళ్ల నుంచి ఎఫ్‌సీఐ చెబుతున్నా.. సీఎం కేసీఆర్ సోమరితనంతో వ్యవహరించారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నుంచి ఏ ప్రత్యామ్నాయ పంటను ప్రోత్సహించలేదని... అందరూ వరి వేయాలని చెప్పారని విమర్శించారు. రీసైక్లింగ్ బియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తూ... మంచి బియ్యాన్ని బయట అమ్ముతున్న మిల్లర్లకు.... కేసీఆర్, కేటీఆర్ సహకరిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. గిరిజన వర్సిటీకి రాష్ట్రమే స్థలం కేటాయించట్లేదని అన్నారు.
ఎఫ్‌సీఐకి వీళ్లు తెలంగాణలో పండే పంట తక్కువ ఇస్తున్నారు. రీసైక్లింగ్ బియ్యం ఎక్కువ ఇస్తున్నారు. తెరాస నేతలు బియ్యం స్మగ్లింగ్‌తో వేల కోట్లు ఆర్జిస్తున్నారు. తెరాస అండతో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారు. కర్నాటక, రాయచూర్, సిరుగప్ప, బళ్లారిలో పండే లో క్వాలిటీ పంటను తీసుకొచ్చి బాయిల్డ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పజెప్పుతున్నారు. తెలంగాణ సోనా అనే మనకు పండే మంచి పంటను ప్రైవేటుగా రూ.40కి అమ్ముతున్నారు. వరి ప్రైమరీ క్రాప్. మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్. మరి తెలంగాణ తల్లి చేతిలో మక్క ఎందుకు పెట్టిన్రు. మక్క ఎందుకు కొంటలేరు? అప్పట్లో అందర్నీ వరి వేయమన్నారు. 2014 నుంచి ఏ పంటకు బోనస్ ఇచ్చారు? ఏ పంటను ఎంకరేజ్ చేశారు? ఏ కొత్త వెరైటీని తెలంగాణలో తీసుకొచ్చారు? ఏ రైతును కాపాడారు?.
-అర్వింద్, భాజపా ఎంపీ
ఇదీ చదవండి: Anandaiah political party : రాజకీయ పార్టీ పెడతా : ఆనందయ్య