ETV Bharat / state

'రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలి' - bjp mlc ramchander rao house arrest

కరోనా కట్టడిపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతలు నిరసన చేపట్టారు. పీహెచ్​సీ, జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ఆందోళనకు బయల్దేరిన భాజపా ఎమ్​ఎల్​సీ రాంచంద్రరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు.

bjp mlc ramchander rao comments Increase corona tests in state
'రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలి'
author img

By

Published : Jun 22, 2020, 1:59 PM IST

కరోనా చికిత్స చేస్తున్న ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆందోళన సిద్ధమైంది. నిరసనకు సిద్ధమైన భాజపా నగర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాంచంద్రరావును తార్నాకలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అన్ని ఆస్పత్రుల్లో ధర్నాకు భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

భౌతిక దూరం పాటిస్తూ 15 మందితో ఆస్పత్రుల వద్ద భాజపా కార్యకర్తలు ధర్నాకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేయడం దారుణమని రాంచంద్రరావు అన్నారు. వెంటనే డాక్టర్లకు సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. కరోనా పరీక్షలను పెంచాలని సూచించారు.

ఇదీ చూడండి : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.