రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెంగీ, విష జ్వరాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు, డాక్టర్లు, టెక్నీషియన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రిపై ఉన్న కోపాన్ని... ముఖ్యమంత్రి ప్రజలపై చూపించటం సరికాదని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల మాఫియాలో ప్రభుత్వం కీలు బొమ్మగా మారిందని దుయ్యబట్టారు. ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేసేందుకే రాష్ట్రంలో ఆయుష్మాన్‌భవ పథకాన్ని అమలుచేయడం లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి: కాలుష్య ప్రభావంతో హస్తినలో ఆరోగ్య అత్యవసర స్థితి