ETV Bharat / state

పేదలకు నిత్యావసరాల పంపిణీ - secundrabad bjp helped needy in lock down

కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచేందుకు భాజపా నాయకులు ముందుకొస్తున్నారని ఎమ్మెల్సీ రాంచందర్​రావు అన్నారు. సికింద్రాబాద్​లో పేదలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.

bjp mlc ramchandar rao distributed groceries to needy in secundrabad
సికింద్రాబాద్​లో సరుకుల పంపిణీ
author img

By

Published : May 5, 2020, 11:19 AM IST

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్నపేద కుటుంబాలకు, వలస కూలీలకు భాజపా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంఛార్జి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు బండేపల్లి సతీశ్ గౌడ్ నిత్యావసర సరుకులు అందజేశారు.

కరోనా కష్టసమయంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు బండేపల్లి సతీశ్ గౌడ్ తన సొంత ఖర్చులతో సరకులు అందజేశారని ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు.

ప్రతి భాజపా కార్యకర్త పేద వర్గాలకు ఎంతోకొంత సాాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపత్కాలంలోనూ విధులు నిర్వహిస్తోన్న 150 మంది జర్నలిస్టులకు రాంచందర్ రావు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.