ఆరేళ్లు ప్రజా సమస్యలపై శాసనమండలిలో తన గళాన్ని వినిపించానని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు తెరాస నుంచి విముక్తి కోరుకుంటున్నారని... భాజపాపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల నుంచి మంచి స్పందన వస్తోందంటున్న రాంచందర్‌రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!