ETV Bharat / state

BJP Leaders Meet Amith shah: అమిత్​ షాను కలవనున్న రాష్ట్ర భాజపా నేతలు.. అందుకోసమేనా?

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో రాష్ట్ర భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు భేటీ కానున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండు రోజుల క్రితం అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరారు. రెండో విడత ప్రజా సంగ్రామయాత్ర, రాష్ట్ర రాజకీయాలు, వరిధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై అమిత్‌ షాతో చర్చించనున్నారు.

BJP Leaders Meet Amithshah: రేపు అమిత్​ షాను కలవనున్న రాష్ట్ర భాజపా నేతలు

author img

By

Published : Dec 8, 2021, 12:26 PM IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రేపు భేటీ కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండు రోజుల కిందటే అమిత్‌ షా అపాయింట్​మెంట్​ కోరారు. రేపు అందుబాటులో ఉండాలని బండి సంజయ్‌కి అమిత్‌ షా కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌ రావులను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ అమిత్‌ షాను కలవనున్నారు.

రెండో విడత ప్రజా సంగ్రామయాత్ర, రాష్ట్ర రాజకీయాలు, వరిధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై అమిత్‌ షాతో చర్చించనున్నారు. 2023 ఎన్నికలే ఎజెండాగా సాగనున్న సమావేశంలో తెరాసపై మరింత దూకుడు పెంచాలని అమిత్‌ షా దిశానిర్ధేశం చేయనున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మొదటి సారి దిల్లీ పెద్దలను ఈటల రాజేందర్‌ కలవబోతున్నారు. ఈ సమావేశంలోనే తీన్మార్‌ మల్లన్న, విఠల్‌ను అమిత్‌ షాకు పరిచయం చేయనున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.