ETV Bharat / state

ర్యాలీకి అనుమతి తీసుకోం.. ఏం చేస్తారో చూస్తాం: రాజాసింగ్​ - bjp mla rajasingh fired on telangana police

భగత్​ సింగ్​ యువసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో రావడం బాధాకరమని అన్నారు. కేసీఆర్​ పాలనలో జాతీయ జెండా ఎగురవేస్తే కేసులు పెడతాం, రౌడీషీట్లు తెరుస్తాం అని పోలీసులు బెదిరించడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.

rajasingh
రాజాసింగ్​
author img

By

Published : Aug 14, 2021, 3:59 PM IST

స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేసేందుకు, ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి.. రాష్ట్రంలో ఉండటం బాధాకరమని హైదరాబాద్​ గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. రేపు పంద్రాగస్టు సందర్భంగా ర్యాలీకి అనుమతి ఇవ్వాలని భగత్​ సింగ్ యువసేన అధ్యక్షుడు శైనథ్​గంజ్​ పోలీసులను కోరితే వారు నిరాకరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని రాజాసింగ్​ వ్యాఖ్యానించారు.

ర్యాలీకి అనుమతి తీసుకోం.. ఏం చేస్తారో చూస్తాం: రాజాసింగ్​

ప్రతి సంవత్సరం గోషామహల్​ నియోజకవర్గంలోని షహినయాత్​​గంజ్​ పోలీస్​ స్టేష్​న్​ పరిధిలో ఆగస్టు 15న చిన్నపాటి ర్యాలీ తీస్తారని రాజాసింగ్​ అన్నారు. జాతీయ పతాకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుందని చెప్పారు. రెండేళ్ల క్రితం ర్యాలీ తీసినందుకు ట్రాఫిక్​ జామ్​ అయిందనే సాకుతో కొందరిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ సారి కూడా అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారని వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్​ ప్రభుత్వం వచ్చాక జాతీయ పతాకం ఎగురవేయాలంటే అనుమతి తీసుకోవాల్సి రావడం సిగ్గుచేటని రాజాసింగ్​ మండిపడ్డారు. కేసులు పెడతాం, రౌడీషీట్ తెరుస్తామని బెదిరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండేళ్ల క్రితం ర్యాలీ తీస్తే కేసులు పెట్టారు. ఈసారి అనుమతి తీసుకోము. జెండా ఎగురవేసి ర్యాలీ తీస్తాం. ఏం చేస్తారో చూస్తాం. కేసులు పెడతారా చూద్దాం.. దీని ద్వారా యావత్​ దేశానికి తెలంగాణలో కేసీఆర్​ పాలనలోని అరాచకాలను తెలియజేస్తాం. -రాజాసింగ్​, గోషామహల్​ ఎమ్మెల్యే

అనుమతి కోసం కమిషనర్​ను అడిగితే ఇస్తారని పోలీసులు చెబుతున్నారని రాజాసింగ్​ ఆరోపించారు. జాతీయ పతాకాన్ని ఎగరవేస్తే కేసులు పెడతాం, రౌడీషీట్‌ తెరుస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ, కమిషనర్‌.. ఇలాంటి పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: REAL ESTATE: హైటెక్స్​లో క్రెడాయ్​ ప్రాపర్టీ షో.. మూడు రోజుల పాటు ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.