కులగణన చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా.. కులాల గురించి కేంద్రాన్ని అడగడం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. కేంద్రమే అప్పుల్లో ఉందన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎఫ్ఆర్బీఎం పెంచమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు 15రోజుల్లోనే అనుమతి ఇచ్చిందని కేంద్రాన్ని పొగిడిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు ఎన్ని శాసనసభలో మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించామని వెల్లడించారు. కేంద్రం నిధులే లేకపోతే పంచాయతీల పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు.
శాసనసభలో సీఎం కేసీఆర్ తనపై వ్యంగ్యంగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే శాసనసభను రెండు రోజులు పొడిగించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం సభా సమయాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సభా హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉల్లంఘించారని ఆయన విమర్శించారు.
హుజూరాబాద్ ఎన్నికల కోసం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, వివిధ పథకాలపై సమీక్ష, దళితబంధుపై చర్చ అంటూ సభా సమయాన్ని దుర్వినియోగం చేశారు. ధరణి, పోడుభూములు, దళితుల సమస్యలు, ఏడీసీడీ వర్గీకరణల మీద చర్చ లేదు. హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు చెప్పిన 50 వేల ఉద్యోగాలు లేవు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కోసం సభను వక్రీకరించారు. -రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇదీ చదవండి: CM KCR Review on Podu Lands: పోడు భూములపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష