ETV Bharat / state

'రాష్ట్రంలో 18 లక్షలకు పైగా సభ్యత్వ నమోదే లక్ష్యం'

author img

By

Published : Jul 7, 2019, 1:38 PM IST

హైదరాబాద్‌ రాంనగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.. రాష్ట్రంలో18 లక్షల పైచిలుకు సభ్యత్వాలు చేర్చే లక్ష్యంతో కార్యకర్తలు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

BJP Membership Registration

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీకొడతోందని తెరాస చేస్తున్న విమర్శలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఖండించారు. హైదరాబాద్​లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్​... పార్టీ శ్రేణులు రాజకీయపరమైన యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు. రాష్ట్రం నిరుద్యోగ సమస్య, విద్యార్థుల ఫీజు రియంబర్స్​మెంట్ వంటి సమస్యలతో సతమతమవుతున్నా... ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ను వంద రోజుల్లో విశ్వనగరంగా మారుస్తానని మున్సిపల్ ఎన్నికల ముందు తెరాస నేత కేటీఆర్ చేసిన వాగ్దానం విస్మరించారని విమర్శించారు. 1000 రోజులు పూర్తయిన ఆ ఊసే లేదని హైదరాబాద్ విషాదకరంగా మారిందని ఆరోపించారు. ఎక్కడి సమస్యలు అక్కడే ప్రజలను పట్టిపీడిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. గుజరాత్‌కు వెళ్ళి అక్కడే నీటి పథకాలను పరిశీలించి... రాష్ట్రంలో ఆయా పథకానికి మిషన్ భగీరథ అని నామకరణం చేసి అమలు చేస్తూ ప్రస్తుతం కేంద్రం ఆ పథకాలను కాపీ కొడుతున్నది అనడంలో అర్థం లేదని ఆయన వివరించారు. తెరాసకు భాజపా అంటే వణుకు పుడుతోందని కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు.

'రాష్ట్రంలో 18 లక్షలకు పైగా సభ్యత్వ నమోదే లక్ష్యం'

ఇదీ చూడండి: 'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

Intro:హైదరాబాద్ లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

Body:రాష్ట్రంలో బిజెపి సభ్యత్వ నమోదు 18 లక్షల పైచిలుకు చేపట్టాలని లక్ష్యంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు.... హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్ లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డాక్టర్ కే లక్ష్మణ్ కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ లాంఛనంగా ప్రారంభించారు ... పార్టీ కార్యకర్తలు నాయకులు రాజకీయపరమైన యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు... రాష్ట్రం నిరుద్యోగ సమస్య', విద్యార్థులు లు ఫీజు రియంబర్స్మెంట్ వంటి సమస్యలతో సతమతమవు తున్న ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఆయన అన్నారు.... హైదరాబాద్ను వంద రోజుల్లో విశ్వనగరం గా మారుస్తానని మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వాగ్దానం విస్మరించారని ని,,, 1000 రోజులు పూర్తయిన ఆ ఊసే లేదని,,, హైదరాబాద్ విషాదకరంగా మారిందని ఎక్కడి సమస్యలు అక్కడే ప్రజలు పట్టిపీడిస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.... కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పథకాలు అవుతుందనడంలో వాస్తవం లేదని ని గుజరాత్ కు వెళ్ళి అక్కడే నీటి పథకాలను పరిశీలించి రాష్ట్రంలో ఆయా పథకానికి మిషన్ భగీరథ అని నామకరణం చేసి అమలు చేస్తూ,,,, ప్రస్తుతం కేంద్రం ఆ పథకాలను కాపీ కొడుతున్న అనడంలో అర్థం లేదని ఆయన వివరించారు.... టిఆర్ఎస్కు బిజెపి అంటే వణుకు పుడుతోందని కేంద్ర మాజీ మంత్రి ,,,మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే టిఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు....

బైట్..... డాక్టర్ కే లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు...
బైక్..... బండారు దత్తాత్రేయ మాజీ ఎంపీ..

Conclusion:రామ్ నగర్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో కాంగ్రెసు టిఆర్ఎస్ పార్టీల నుండి పెద్ద ఎత్తున చేరిన నాయకులు కార్యకర్తలకు కండువాలు కప్పి,,, పార్టీ సభ్యత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్,, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ పార్టీలోకి ఆహ్వానించారు......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.