BJP Lok Sabha Elections 2024 Telangana : లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections2023) జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని బీజేపీ రాష్ట్రనాయకత్వం నిర్ణయించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి 10సీట్లు, 35 శాతం ఓటుబ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడం సహా మరో ఆరుచోట్ల విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.
BJP Focus on Parliament Elections 2024 : తెలంగాణ నుంచి అధిక సీట్లు గెలిచి మోదీ హ్యాట్రిక్ (Modi Hattrick) విజయంలో భాగస్వామ్యంకావాలని రాష్ట్రనాయకత్వం భావిస్తోంది. ఎక్కువసీట్లు గెలవాలంటే తొలుత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ జిల్లాలవారీగా, అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన వారి వివరాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుల నుంచి నేతల వ్యవహార శైలిపైనాఆరాతీసింది. అసమ్మతి నేతల రహస్య సమావేశాలపై చర్యలు తీసుకోవాలని భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం : ఈటల
అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య సోషల్‌మీడియా వార్‌పై (Social Media War) పార్టీకి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ యోచిస్తోంది. బండిసంజయ్, ఈటల రాజేందర్ మధ్య చాలా రోజులుగా ఆ వార్ కొనసాగుతోందని కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న పలువురు రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడంపై పార్టీ ఆగ్రహంతో ఉంది. జిల్లా కమిటీల నివేదికల ఆధారంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్‌కి వ్యతిరేకంగా, ఇప్పటికే పలుమార్లు అసమ్మతినేతలు రహస్యంగా భేటీ కావడంపై ఆగ్రహంగా ఉంది. ఆ సమావేశాలు నిర్వహించిన వారిపై వేటుపడే అవకాశముందని సమాచారం. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర అధినాయకత్వానికి క్రమశిక్షణ కమిటీ చేరవేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్ నోటీసులివ్వాలని భావిస్తోంది. వారి నుంచే సమాధానం ఆమోదయోగ్యం కాకుంటే వేటు వేయాలని నిర్ణయించింది.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పక్కా : ఎంపీ లక్ష్మణ్
BJP Plans To Change District Chief in Telangana : పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాల అధ్యక్షులను మార్చాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. గతంలో బండిసంజయ్ అధ్యక్షులను నియమించగా, తన మార్క్ చూపేట్టేలా మార్పులు చేయలని కిషన్ రెడ్డి యోచిస్తున్నారు. ఆ విషయంపై రెండు రోజులుగా కసరత్తు చేసిన ఆయన 15 నుంచి 20 మంది జిల్లా అధ్యక్షులను మార్చి కొత్తవారిని నియమిస్తున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. గురువారం దిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన నివేదికను పార్టీ అధిష్టానానికి ఇవ్వనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు.
BJP Focus on Lok Sabha elections 2024 : ముచ్చటగా మూడోసారి కమలం వికసించేనా..!