ETV Bharat / state

'ప్రధాని సభతో తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు' - modi

రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని బహిరంగ సభ తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. కాంగ్రెస్​తో విసిగిపోయిన నేతలు రేపు పెద్దసంఖ్యలో కమలం పార్టీలో చేరుతున్నారని ప్రకటించారు.

ఎన్నికల పాటల సీడీలు విడుదల
author img

By

Published : Mar 31, 2019, 6:36 PM IST

ఎన్నికల పాటల సీడీలు విడుదల
సోమవారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ప్రధాని మోదీ సభా ఏర్పాట్లను భాజపా నేతలు పరిశీలించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ సభా వేదిక వద్ద లోక్‌సభ ఎన్నికల పాటల సీడీలను ఆవిష్కరించారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో విసిగిపోయిన నేతలు పెద్ద సంఖ్యలో భాజపాలో చేరుతున్నారని చెప్పారు. రేపటి సభలో మాజీమంత్రి విజయరామారావు, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాజపా దూసుకుపోతుందని... ప్రచారంలో భాగంగా ప్రధానితో పాటు జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటనలు కూడా ఖరారైనట్లు లక్ష్మణ్‌ చెప్పారు.

ఇవీ చూడండి: 'ఎన్నికల తర్వాత... వారి మద్దతు మాకే'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.