ETV Bharat / state

ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌.. రైల్వేమంత్రిని కోరిన భాజపా నేతలు - రీజనల్‌ రింగ్‌రోడ్డు

ప్రాంతీయ వలయ రహదారి చుట్టూ ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించాలని రాష్ట్ర భాజపా నేతలు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ విస్తరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని స్వామిగౌడ్‌ కోరగా, మిగిలిన నేతలూ అదే అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌.. రైల్వేమంత్రిని కోరిన భాజపా నేతలు

author img

By

Published : Mar 5, 2022, 7:10 AM IST

రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) చుట్టూ ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించాలని రాష్ట్ర భాజపా నేతలు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లాలో కవచ్‌ పరిశీలన అనంతరం ఆయన నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు తదితరులతో సమావేశమయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ విస్తరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని స్వామిగౌడ్‌ కోరగా, మిగిలిన నేతలూ అదే అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఏర్పాటు, వ్యయం గురించి కిషన్‌రెడ్డి వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ 340 కిమీ పొడవు కావడంతో ఖర్చు ఎక్కువ అవుతుందని, భూసేకరణ చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిద్దామని రైల్వేమంత్రి అన్నట్లు తెలిసింది. పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.