BJP Leaders on Atal Bihari Vajpayee Anniversary : రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే పరమామధిగా పనిచేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారి వాజ్‌పేయీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో (Basavatarakam Cancer Hospital) మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
Kishan Reddy About Atal Bihari Vajpayee : బస్సులో పాకిస్థాన్‌కు వెళ్లి శాంతి కోసం చర్చలు జరిపి, దేశ ప్రయోజనాల కోసం కార్గిల్ యుద్ధం(Kargil war) గెలిచిన ఘనత వాజ్పేయీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి భవనాన్ని వాజ్‌పేయీ ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన జయంతి వేడుకలు ఇక్కడ జరపడం సంతోషకరమన్నారు. అటల్ బీహారి వాజ్‌పేయీ నవయుగ సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్నారని అన్నారు. వాజ్‌పేయీ అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఆకాంక్షించారని, ఆయన కల సాకారం కాబోతుందని తెలిపారు.
వాజ్‌పేయీకి ప్రముఖుల ఘన నివాళులు- సేవలను గుర్తు చేసుకున్న మోదీ
Vajpayee Anniversary as Sushasan Divas : వాజ్‌పేయీ జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం సుశాసన్ దినోత్సవం పేరుతో నిర్వహిస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం, అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవిత విశేషాలపై సభలు, సమావేశాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నామని అన్నారు. వాజ్‌పేయీ నైతిక విలువలతో కూడిన రాజకీయాలతో పరిపాలన చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడారని తెలిపారు. నాడు పార్లమెంటులో ఒక్క ఓటు తక్కువ ఉన్నందున, వాజ్‌పేయీ నైతిక బాధ్యత(Moral Responsibility) వహిస్తూ, విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.
MP Laxman on Atal Bihari Vajpayee Anniversary : అటల్ బిహారి వాజ్‌పేయీ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తూ మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డా.కె లక్ష్మణ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి కె.లక్ష్మణ్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ , బీజేపీ నాయకులు పూసరాజు తదితరులు పూలువేసి నివాళులు అర్పించారు.
MP Laxman speech about vajpayee : పేద ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. దేశంలోని పేదలకు ప్రధాని నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించారని ఆయన గుర్తు చేశారు. వాజ్‌పేయీ ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు కంకణ బదులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
'వాజ్‌పేయీ గొప్ప పరిపాలన దక్షుడు.. ఆయనకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది'