BJP Leaders Nirasana Deeksha in Hyderabad : బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, జీతాలు రావని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ 9ఏళ్ల పాలనలో.. ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ.. భారతీయ జనతా పార్టీ(BJP) ఇవాళ నిరసన దీక్ష చేపట్టింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఇవాళ ఉదయం 11 గంటల నుంచి గురువారం ఉదయం 11 గంటల వరకు 24 గంటలు ఆందోళన చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(BJP State President Kishan Reddy), జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్( Bandi Sanjay), పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పదాధికారులు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారకంగా నిర్వహించలేదని తెలిపారు.
Bandi Sanjay Fire on CM KCR : మజ్లిస్ కోసమే జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని ఆరోపించారు. ఈ దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో కాకుండా దారుసలాంలో చేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జమిలి ఎన్నికలు అంటే భయపడుతున్నారని.. ఆ ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర చెప్పే వరకు ఓపిక లేకుండా కేసీఆర్ కుటుంబం వనికిపోతుందని విమర్శించారు. జమిలి ఎన్నికలు జరిగినా.. షెడ్యూల్ ప్రకారం సింగిల్‌గా జరిగినా.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.
Bandi Sanjay Bike Rally In Vemulawada : 'బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది'
మంత్రివర్గంలో ఉన్న మంత్రులకి ఎలాంటి పవర్ లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రివర్గం కంటే ముఖ్యమంత్రికి సలహాదారులే ఎక్కువని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, జీతాలు రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే జీతాలు, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు.
"ఒక కుటుంబం చేతిలో తెలంగాణ సర్వనాశనం అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే మళ్లీ బీఆర్ఎస్లోకే వెళతారు. నయా రజాకార్ల పార్టీని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం. కేసీఆర్‌కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, జీతాలు రావు. ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్ నిర్వీర్వం చేశారు. బీఆర్ఎస్ వస్తే మళ్లీ ప్రజలకి అన్యాయం జరుగుతుంది." - బండి సంజయ్, జాతీయ ప్రధానకార్యదర్శి
Bandi Sanjay Cycle Ride : సైకిలెక్కిన బండి.. పిల్లలతో సరదాగా ముచ్చట్లు