BJP Leaders Met Central Election Commission: మునుగోడు ఉప ఎన్నికలో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భాజపా నేతల బృందం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి మురళీధరన్ నేతృత్వంలో ఈసీకి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, భాజపా సీనియర్ నేత రాంచందర్ రావు ఈసీని కలిశారు.
ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ ఆరోపించారు. ఓటర్ జాబితాలో అవకతవకలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పరిశీలకుణ్ని నియమించాలని ఈసీని కోరినట్లు వివరించారు. ఈ క్రమంలోనే దిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్న వారంతా అరెస్టు అవుతారంటూ తరుణ్‌చుగ్ వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఓటర్ జాబితాలో అవకతవకలు చేస్తున్నారు. ప్రశాంత ఎన్నికల కోసం పరిశీలకుణ్ని నియమించాలని ఈసీని కోరాం. దిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్న వారంతా అరెస్ట్ అవుతారు. - తరుణ్‌చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
ఇవీ చూడండి..
మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు ఏం చెప్పిందంటే?
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక.. ఈసారి పోలింగ్ శాతం పెరిగేనా?