ETV Bharat / state

'మేం వైదొలుగుతున్నాం... భాజపా విజయం కోసం పనిచేస్తాం' - Ghmc elections 2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాల్సిన అవసరం ఉంది: పవన్‌ కల్యాణ్‌

author img

By

Published : Nov 20, 2020, 3:04 PM IST

Updated : Nov 20, 2020, 5:20 PM IST

15:02 November 20

'మేం వైదొలుగుతున్నాం... భాజపా విజయం కోసం పనిచేస్తాం'

       జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కార్యకర్తలు నిరుత్సాహం చెందవద్దని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు భాజపా విజయం కోసం పనిచేయాలని సూచించారు. ఏపీలో కూడా భాజపాతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

   తెలంగాణలో కలిసి పనిచేయాలనుకునే సమయంలో కరోనా వచ్చిందని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భాజపా గెలవాలన్నారు. రాష్ట్రంలో జనసేన, భాజపా రోడ్ మ్యాప్‌పై భవిష్యత్తులో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    భాజపాకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.  

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు భవిష్యత్తు ఎన్నికల్లోనూ ఇరుపార్టీలు కలిసి వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఇవే..

Last Updated : Nov 20, 2020, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.