ETV Bharat / state

'తెలంగాణలో ఉన్నది బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాదు.. లీకేజీ​ సర్కార్' - bandi sanjay fire on brs

BJP leaders criticized the BRS government: ఈ నెల 8న ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ఆధునీకరణ పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. అనంతరం బీఆర్​ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రపంచంలో ఉండే పార్టీలన్నింటికీ కేసీఆర్​ నాయకుడి అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు.

BJP state president Bandi Sanjay
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
author img

By

Published : Apr 4, 2023, 1:41 PM IST

Updated : Apr 4, 2023, 3:13 PM IST

Bandi sanjay comments on KCR: ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్దిని బీఆర్‌ఎస్ నేతలు కళ్లు ఉండి చూడలేని కబోదులని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణ సర్కార్​ అని ధ్వజమెత్తారు. ఈనెల 8న ప్రధాని రాక సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​లతో కలిసి లక్ష్మణ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే కేంద్ర ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వేశాఖ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించిందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు.

రాజ్యాంగంలో చదువులకు పదవులకు సంబంధం లేదు : తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలును ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఈ నెల 8న పలు జాతీయ రహదారులకు మోదీ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సీఎం కేసీఆర్​పై​ విమర్శలు వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తన డిగ్రీ సర్టిఫికేట్లు చూపించాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్​ వేసిన పిటిషన్​పై ఆయన స్పందించారు. రాజ్యాంగంలో చదువులకు పదవులకు సంబంధం లేదన్నారు. మోదీని విమర్శించే వారంతా చదువుకున్న అజ్ఞానులని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ ఎమ్మెస్సీ పొలిటికల్​ సైన్స్​ సర్టిఫికేట్లను బయటపెట్టాలని ధ్వజమెత్తారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. లీకేజీ​ల ప్రభుత్వం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ​ కేసులో సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎక్కడ చూసిన లీకేజీలే ఎక్కువ అయ్యాయని.. వీటికి ఉదాహరణగా టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పదో తరగతి పేపర్​ లీక్​, ధరణి పోర్టల్​ అని వివరించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని లీకేజీ​ల ప్రభుత్వమని ఆయన ఆరోపించారు.పేపర్ లీక్ కాకుండా చూడలేని అసమర్థ సీఎం అని పేర్కొన్నారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జీ​తో విచారణ జరిపించడానికి ఇబ్బందేంటని సంజయ్ ప్రశ్నించారు. వరంగల్​లో నిరుద్యోగ మార్చ్​ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఇల్లు కూడా లేదని... ప్రస్తుతం అన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

  • BRS MLA facing Sex abuse allegations shares stage with #TwitterTillu

    BRS MLC who abuses governor gets elevated as Govt whip

    BRS MLA & First health minister who sought sexual favours from woman sarpanch shares stage with CM KCR

    BRS MLA’s son accused of abetting suicide of 3,…

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రపంచ పార్టీలన్నింటికీ కేసీఆరే నాయకుడు అవుతారు : రాష్ట్రానికి కేటీఆర్​ కంపెనీలు తీసుకువస్తున్నాడని.. టెక్నాలజీలో అభివృద్ది చెందామంటున్నారు.. కానీ ప్రస్తుతం ఏ ప్రదేశంలో అలా కనిపించట్లేదని బండి సంజయ్ విమర్శించారు. బాసర ఐఐఐటీలో విద్యార్థులు ఎన్నో సమస్యలు పడుతున్నారని.. ఇది వరకే చాలా సార్లు విద్యార్థులు ధర్నాలు చేశారని గుర్తుచేశారు. ఆర్జీయూకేటీలో ప్రభుత్వ నిర్వాహణ లోపం ఉందన్నారు. ప్రపంచంలో అన్ని పార్టీలకు సీఎం కేసీఆర్ నాయకుడు​ అవుతారని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 4, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.