ETV Bharat / state

అర్హులకే రూ.పది వేల ఆర్థిక సాయం అందించాలంటూ భాజపా ధర్నా

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల తర్వాత వరద నీటి ప్రవాహం ఆగినా.. బురద మాత్రం పోవట్లేదని... వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైదరాబాద్​ ఎల్బీనగర్​లో భాజపా నాయకులు ధర్నాకు దిగారు. మరోపక్క అర్హులైన లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందజేయాలని వారు డిమాండ్​ చేశారు.

bjp leaders arrested as they protested at ghmc office
అర్హులకే రూ.పది వేల ఆర్థిక సాయం అందించాలంటూ భాజపా ధర్నా
author img

By

Published : Nov 6, 2020, 3:20 PM IST

హైదరాబాద్​లో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వీరికి కలిగిన నష్టానికి ప్రభుత్వం రూ. పది వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే ఎల్బీనగర్​ పరిధిలో అధికార పార్టీ నాయకులు.. నిజమైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించట్లేదని భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీహెచ్ఎంసీ సర్కిల్​ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

భాజపా నాయకులు ధర్నా చేపట్టడం వల్ల కొత్తపేట- సరూర్​నగర్​ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం స్పందించి.. నిజమైన బాధితులకే ఆర్థిక సహాయం అందేలా చూడాలని డిమాండ్​ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండిః లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు నరకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.