వరద బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ... భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. షేక్ పేట్, ఫిలింనగర్ ప్రాంతాలకు చెందిన వరద బాధితులు తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. అసలైన బాధితులకు కాకుండా తెరాస పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే రూ.పది వేల ఆర్థిక సాయం అందిస్తున్నారంటూ భాజపా నాయకులు ఆరోపించారు. అధికారుల చుట్టూ బాధితులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందే వరకు వెళ్ళేది లేదంటూ కార్యాలయం ద్వారం ముందు భాజపా నాయకులు, బాధితులు బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు కార్యాలయం లోపలికి అనుమతించక పోవడంతో... ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి: వరద సహాయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి