గ్రేటర్ ఎన్నికల వేళ తెరాసలోకి వలసల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గులాబి గూటికి చేరారు. వారందరికీ మంత్రి పువ్వాడ అజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో విరబూసిన కమలం…జీహెచ్ఎంసీ లోనూ అదే దూకుడు కొనసాగిస్తుందని కాషాయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారాల్లో అంసతృప్తితో ఉన్న నాయకులు తమ కార్యకర్తలతో కలిసి పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు.. ఎవరు.. ఏ పార్టీ వైపు జంపు చేస్తారో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి: ఇకపై యాప్లో విద్యుత్ శాఖ పింఛన్దారుల లైఫ్ సర్టిఫికెట్