ప్రభుత్వంలో ఉన్న అవినీతి నాయకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న న్యాయవాదులను హతమర్చడం హేయమైన చర్య అని భాజపా నేత రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహా రెడ్డితో కలిసి డీజీపి మహేందర్ రెడ్డిని కలిశారు.
న్యాయవాదుల హత్యకేసులో ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు ఉన్నారని... నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేయాలని కోరినట్లు వెల్లడించారు. న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: జడ్పీ ఛైర్మన్ పుట్టమధుపై అనుమానం : కిషన్ రావు