మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని... రాజకీయ లబ్ది కోసం తెరాస ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ, భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ అన్నీ తెలిసి స్వార్థపూరిత అడుగులు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయంలో అసదుద్దీన్... జనాభా లెక్కలు చేయలేదా...? కేసీఆర్ సకల జనుల సర్వే చేయలేదా..? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న అక్రమ చొరబాటు దారులకు పౌరసత్వం ఇవ్వాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుంధతి రాయ్ వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఎన్ఆర్సీ కంటే ముందు మోదీ డిగ్రీ పట్టా చూపించాలి'