రాష్ట్రంలో భాజపా బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని గాయత్రి గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ హాజరయ్యారు.
స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం కోలుకునే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామన్నారు.
వ్యాక్సిన్ వేగవంతానికి కృషి చేయాలి
ప్రజలకు వ్యాక్సిన్‌పై ఉన్న అపోహాలను తొలగించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మురళీధర్ రావు సూచించారు. ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. కరోనా విపత్కర సమయంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో పేద ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ శాతం వ్యాక్సిన్లు వేస్తున్న దేశంగా భారతదేశం నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మురళీధర్ రావు పేర్కొన్నారు.
దేశంలో కొవిడ్ విజృంభిస్తుంటే తరుణంలో ఆత్మనిర్భర్ భారత్ పేరిట పేదలను ఆదుకున్నాం. పార్టీ కార్యకర్తలకు సేవా కార్యక్రమాలు, రాజకీయ, క్రియాశీలకంగా ఉండి శిక్షణనిచ్చే పార్టీ భాజపా ఒక్కటే. రాబోయే ఎన్నికల్లో భాజపాదే విజయం. ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మనం ఎండగట్టాలి. మనందరం కూడా కేంద్రం ఇస్తున్న పథకాలు, వ్యాక్సినేషన్‌పై ప్రచారం చేయాలి. రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా కృషి చేయాలి. ఇదేవిధంగా కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో మనదే విజయం - మురళీధర్‌రావు. భాజపా నేత.
ఇదీ చూడండి: BANDI SANJAY: 'ఏడేళ్ల తర్వాత నిద్రలేచి ఇప్పుడు మాట్లాడుతున్నారు'