ETV Bharat / state

ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తూ అభద్రత భావనలో కేసీఆర్‌ ఉన్నారు: లక్ష్మణ్‌

Bjp leader Laxman: 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అద్దం పట్టేలా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. 20 ఏళ్ల తర్వాత భాగ్యనగర్‌ వేదికగా జరగబోతున్న కార్యవర్గ సమావేశాలు చరిత్రాత్మకమైనవిగా ఆయన అభివర్ణించారు. మూడురోజుల పాటు జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో విజయ సంకల్ప సభకు పదిలక్షల మంది హాజరవుతారని తెలిపారు. కార్యవర్గ సమావేశాల తరువాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు. అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యమని సమావేశాల ద్వారా సందేశం వెళుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

author img

By

Published : Jun 29, 2022, 2:25 PM IST

లక్ష్మణ్‌
లక్ష్మణ్‌

Bjp leader Laxman: రాష్ట్రంలో జులై 2,3తేదీల్లో హైదరాబాద్​ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని మోదీ, జేపీ. నడ్డా, అమిత్ షాతో పాటు 18రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతరన్నారు. ఈసమావేశాలను చరిత్రాత్మక సమావేశాలగా ఆయన అభివర్ణించారు. గతంలో 20ఏళ్ల క్రితం హోటల్ వైస్రాయిలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయని లక్ష్మణ్ తెలిపారు. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్​పేయి, ఎల్​కే అడ్వాణీ హాజరయ్యారు. విజయ సంకల్ప సభ అంటే అధర్మంపై ధర్మం గెలవడమని చెప్పారు. అన్యాయం, నిరంకుశత్వంపై సంకల్పం తీసుకుని ప్రజలకు భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు.

భాజపా కార్యవర్గ సమావేశాల తరువాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతుంది

రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామన్నారు. కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకొని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీ రాజకీయాలను సీఎం ప్రోత్సహిస్తున్నారంటే ఎంత అభద్రతకు లోనవుతున్నారో అర్ధమవుతుందన్నారు. కుటుంబ రహిత, అవినీతి రహిత పాలన భాజపా వల్లే సాధ్యమని పేర్కొన్నారు. కార్యవర్గ సమావేశాల తరువాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

షెడ్యూల్​ వివరాలు..

  • 16రాష్ట్రాలకు సంబంధించిన సమ్మేళనాల సందర్భంగా కార్యవర్గ సమావేశాల నిర్వహణ
  • జులై 1న సాయంత్రం 4గంటలకు శంషాబాద్ పట్టణంలో జేపీ నడ్డాకు స్వాగతం పలుకుతూ రోడ్ షో
  • తెలంగాణ సాంస్కృతి,సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ ఉద్యమం, నిజాం కు వ్యతిరేకంగా సాగిన పోరాట ఘట్టాలను ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
  • రాత్రి 7గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం
  • రాత్రి 8:30కి భారత నాట్యం, పెరిణి శివ తాండవం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు
  • జులై 2న ఉదయం 10గంటలకు జాతీయ పదాధికారులతో జేపి నడ్డా సమావేశం
  • సాయంత్రం 4గంటలకు కార్యవర్గ సమావేశాలను జేపీ నడ్డా ప్రారంభిస్తారు
  • జులై 3వరకు కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయి
  • సాయంత్రం 4 గంటలకు కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి
  • సాయంత్రం 5గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో విజయ సంకల్ప పేరుతో బహిరంగ సభ
  • 4వ తేదీన ఉదయం అన్ని రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులు సమావేశం
  • ఈ సమావేశాలు మధ్యాహ్నంతో ముగుస్తాయి
  • సమావేశాల విజయవంతం కోసం 34కమిటీలు పని చేస్తున్నాయి
  • తెలంగాణకు సంబంధించిన వంటకాలు సకినాలు, జొన్న రొట్టె, సర్వపిండి, మడుగులు, గారెలు ప్రతినిధులకు అందిస్తున్నాం

"దాదాపు 20సంవత్సరాల తర్వాత తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆయా వర్గాల సమ్మిళితంతో సమావేశం. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాకను పురస్కరించుకొని రోడ్ షో ఏర్పాటు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రితీలో సంప్రదాయాల కళలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్. జులై 2న ఉదయం 10గంటలకు జాతీయ పదాధికారులతో జేపీ నడ్డా సమావేశం. సాయంత్రం 4గంటలకు కార్యవర్గ సమావేశాలను జేపీ నడ్డా ప్రారంభిస్తారు. జులై 3న సాయంత్రం 4 గంటలకు కార్యవర్గ సమావేశాలు ముగింపు. సాయంత్రం 5గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు." -లక్ష్మణ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి: Revanth Reddy Tweet : 'విద్యార్థులారా.. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యం'

'మహా' సంక్షోభం: గవర్నర్‌ ఆదేశాలను సవాల్​ చేస్తూ.. సుప్రీంకు శివసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.