ETV Bharat / state

Laxman on TRS Plenary: తెరాసలో త్వరలో చీలిక తప్పదు: లక్ష్మణ్​ - ts news

Laxman on TRS Plenary: తెరాస 21వ ప్లీనరీ పరనిందా ఆత్మస్తుతిగా జరిగిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ అవినీతి సొమ్ము ద్వారా రాజకీయం చేయడంలో రోల్‌ మోడల్‌గా మారారని విమర్శించారు. ఎనిమిదేళ్లు అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కార్‌ విద్యుత్‌, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.

Laxman on TRS Plenary: తెరాసలో త్వరలో చీలిక తప్పదు: లక్ష్మణ్​

author img

By

Published : Apr 28, 2022, 1:02 PM IST

Laxman on TRS Plenary: తెలంగాణను దోచుకున్నది చాలక.. దేశాన్ని దోచుకునేందుకు జాతీయస్థాయికి వెళ్తారా అని తెరాస ప్లీనరీ సమావేశాల గురించి భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ ఘాటుగా విమర్శించారు. మోదీను, భాజపాను విమర్శించడానికే సమావేశాలను నిర్వహించారన్నారు. ప్రశ్నించారు. కేంద్రాన్ని, సైన్యాన్ని విమర్శిస్తూ చైనాను పొగుడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశాన్ని ప్రగతి బాట పట్టించేందుకు తెరాస వద్ద ఎజెండా ఉంటే ప్రజల ముందు పెట్టాలని లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు.

ఆత్మహత్యల్లో రాష్ట్రం రోల్‌ మోడలా?: మళ్లీ అధికారంలోకి రాలేమనే ఉద్దేశంతో తెరాస నేతలు దోపిడీ చేస్తున్నారని.. ఉద్యమం పేరిట కోట్లు గడించారని ఆయన ఆరోపించారు. దోచుకున్న డబ్బును దాచుకోవడానికి అధికారం కావాలని ఆయన విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. తెరాసలో త్వరలో చీలిక తప్పదని లక్ష్మణ్​ జోస్యం చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశాన్ని మోదీ నడిపిస్తున్నారన్నారు. తెరాస నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జాతీయస్థాయి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యల్లో రాష్ట్రం రోల్‌ మోడలా అంటూ ప్రశ్నించారు. పల్లెల్లో బెల్టుషాపులు, బార్లు తెరిచి మద్యం ఏరులై పారిస్తున్నారని లక్ష్మణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాబాహుళ్యంలోకి వచ్చి చూస్తే విద్యుత్‌ కోతలున్నాయా.. లేవా అని తెలుస్తుందన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌లు పెంచాలి: తెరాస 21వ ప్లీనరీ పరనిందా ఆత్మస్తుతిగా జరిగిందని లక్ష్మణ్​ అన్నారు. 8 ఏళ్ల తెరాస అవినీతి పాలన నుంచి దృష్టి మరల్చే పన్నాగం జరుగుతోందన్నారు. అవినీతి సొమ్ము ద్వారా రాజకీయం చేయడం రోల్ మోడల్‌లా? అంటూ లక్ష్మణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేశారని ఆయన తెలిపారు. తెరాస రజాకార్ల సమితిగా మారిందన్న లక్ష్మణ్​.. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినా వీఆర్ఎస్ ఖాయమన్నారు. హిందువులపై దాడులు జరిగితే ప్రభుత్వం స్పందించడం లేదని.. హిందువులను కించపర్చడమే మత సామరస్యం అవుతుందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌లు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు పెంచుతామన్నారు. గిరిజన, బీసీ బంధును కూడా కేసీఆర్ అమలు చేయాలన్నారు.

నిధులివ్వడం లేదు: భాజపా పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై 15 శాతం వ్యాట్ తగ్గించాయని.. 30 శాతం వ్యాట్ విధిస్తూ కేసీఆర్‌ పైసా కూడా తగ్గించడం లేదన్నారు. తెరాస నేతలు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో మాత్రం మహిళా గవర్నర్‌ను అవమానపరుస్తారని లక్ష్మణ్​ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులివ్వడం లేదని ఆయన వెల్లడించారు.

"మళ్లీ అధికారంలోకి రాలేమనే ఉద్దేశంలో తెరాస నేతలున్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. ఉద్యమం పేరిట తెరాస నేతలు కోట్లు గడించారు.దోచుకున్న డబ్బును దాచుకోవడానికి అధికారం కావాలి.కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నిస్తున్నారు. తెరాసలో త్వరలో చీలిక తప్పదు. కేంద్రాన్ని, సైన్యాన్ని విమర్శిస్తూ చైనాను పొగుడుతున్నారు. తెరాసకు ఒక అజెండా అంటూ ఏమైనా ఉందా?. తెలంగాణను దోచుకున్నది చాలక.. దేశాన్ని దోచుకునేందుకు జాతీయస్థాయికి వెళ్తారా?. తెరాస నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జాతీయస్థాయి ప్రకటనలు చేస్తున్నారు." -లక్ష్మణ్​, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

తెరాసలో త్వరలో చీలిక తప్పదు: లక్ష్మణ్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.