ETV Bharat / state

లక్ష్మణ్‌ అరెస్ట్‌.. ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం

విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ భాజపా ధర్నాను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మింట్‌ కాంపౌండ్‌కు బయలు దేరిన ఆ పార్టీ నేతలను అరెస్ట్‌ చేశారు. లక్ష్మణ్‌ను ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ రాంచందర్​రావులను.. గృహ నిర్బంధం చేశారు.

BJP
BJP
author img

By

Published : Jun 15, 2020, 11:07 AM IST

Updated : Jun 21, 2020, 11:02 PM IST

విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ మింట్‌ కాంపౌండ్‌ వద్ద ధర్నా నిర్వహించేందుకు బయలు దేరిన భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాజపా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌ను అశోక్ నగర్‌లోని ఆయన నివాసం వద్ద చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్​రావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌజ్​ అరెస్ట్​ చేశారు.

లక్ష్మణ్‌ అరెస్ట్‌.. ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం

మరోవైపు పోలీసుల తీరును నేతలు ఖండించారు. శాంతి యుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ నియంత పాలన సాగిస్తున్నారని.. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి, 3 నెలల కరెంట్​​ బిల్లులు ఒకేసారి కట్టమనడం దారుణమన్నారు. ప్రజలను ఇంటి అద్దెలు కట్టొద్దని చెప్పిన సీఎం.. ఇప్పుడు విద్యుత్​ బిల్లులు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే విద్యుత్​ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్​ చేశారు.

బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఉదయం నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు.

ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం

ఇదీచూడండి: బీఆర్కే భవన్​లో ఈటల సమీక్ష... కరోనా పరీక్షల ఫీజులపై చర్చ!

Last Updated : Jun 21, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.