జోగులాంబ గద్వాల్ జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం బాధకరమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నడిగడ్డ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ.. కేసీఆర్కు ఆమె బహిరంగ లేఖ రాశారు.
నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు వైద్య కళాశాలలను సీఎం మంజూరు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని డీకే అరుణ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు కూడా వెంటనే మెడికల్ కాలేజీని మంజారు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'కుటుంబ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'