ETV Bharat / state

'రాజకీయాల్లో ఓనమాలు తెలియని ఆ ఎమ్మెల్సీని వెంటనే బర్తరఫ్ చేయాలి'

DK Aruna fires on BRS MLC: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మరోసారి తనదైన శైలిలో బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు గుప్పించారు. గవర్నర్​పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను అరుణ ఖండించారు. మహిళా అనే గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్సీను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Dk Aruna
Dk Aruna
author img

By

Published : Jan 26, 2023, 9:07 PM IST

Updated : Jan 26, 2023, 9:21 PM IST

DK Aruna fires on BRS MLC: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​పై ఓ బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్​ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర దినోత్సవాలకి వచ్చాయా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్​పై నోటికి వచ్చిన కూతలు కూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని అరుణ మండిపడ్డారు.

గణతంత్ర వేడుకలు జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని డీకే అరుణ ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించేలా లేదని, దేశంలో తెలంగాణ అంతర్భాగం కానట్లు రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తుందని అరుణ మండిపడ్డారు. మహిళా అనే గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్సీను వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 26, 2023, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.