ధనార్జనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వ దోపిడీపర్వం సాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో భాజపా పుంజుకోకుండా తెరాస, కాంగ్రెస్‌లు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
రాష్ట్రంలో భాజపా ఎదుగుదలను ఓర్వలేకే తెరాస, కాంగ్రెస్ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అరుణ మండిపడ్డారు. సచివాలయం విషయంలో కాంగ్రెస్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్పందించకుండా.. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేతలు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
ఇదీచూడండి: వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది: కేటీఆర్