Boora Narsaiah Goud Fires On Trs: భాజపా ఉద్యమ పార్టీ అయితే తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని భాజపా నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. తెరాసను ఎందుకు వీడుతున్నారో ప్రజలు గ్రహించాలని సూచించారు. ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను తెరాసను వీడారని గుర్తు చేశారు. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైద్య వృత్తి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారుడిని అయ్యానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. భువనగిరి ఎంపీగా ఎన్నికై కేంద్ర ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచానని గుర్తు చేశారు. భాజపా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌కు ఏవరైనా వెళ్లాలంటే సంవత్సరాలు, దశాబ్దాలు పట్టొచ్చని బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కేసీఆర్ గట్టుప్పల్ మండలం ఇచ్చారని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఓట్లు, సీట్లు, డబ్బులే ముఖ్యమని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఒక్కో ఎమ్మెల్యే బూత్‌కు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.
ఫ్లోరోసిస్ లేనప్పుడు ఆ కేంద్రం ఎందుకు?: మంత్రి మల్లారెడ్డి సిల్క్ స్మితలాగా తయారయ్యారని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఉప ఎన్నిక తరువాత నేతలు వరదలాగా భాజపాలో చేరుతారని పేర్కొన్నారు. ప్లోరోసిస్ పోయిందని చెబుతున్న తెరాస నేతలు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. లేని రోగానికి వైద్యం చేయడానికేనా అంటూ బూర నర్సయ్య గౌడ్ నిలదీశారు.
ఇవీ చదవండి: తెరాస నుంచి నేను వెళ్లలేదు.. కేసీఆరే కావాలని పంపించారేమో: బూర నర్సయ్యగౌడ్
భాజపా, జేపీ నడ్డా అబద్ధాలకోరులు: కేటీఆర్
యువతకు మోదీ 'దీపావళి' గిఫ్ట్.. 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు