ETV Bharat / state

ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భాజపాదే విజయం: లక్ష్మణ్‌ - తెరాస, ఎంఐఎంపై భాజపా ఆరోపణలు

తెరాస, మజ్లిస్​పై విమర్శలు గుప్పించారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో భాజపా జైత్రయాత్ర ప్రారంభమైందన్న ఆయన... ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భాజపాదే విజయం: లక్ష్మణ్‌

author img

By

Published : Dec 6, 2020, 1:38 PM IST

ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భాజపాదే విజయం: లక్ష్మణ్‌

దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయదుంధుబి మోగిస్తుందని.... ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస, మజ్లిస్‌ పార్టీలు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయన్న ఆయన.... 2023లో భాజపానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు.... గ్రేటర్‌ ఫలితాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల హామీలను తుంగలో తొక్కి... ఓట్లు పొంది 100 మంది కార్పొరేటర్లను గెలిపిస్తే... ఏ రకంగా హైదరాబాద్​ను వల్లకాడుగా మార్చిండ్రు. చిన్నపాటి వర్షం వస్తే.. వరదలు, బురదలు. పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు ఎంపీల ద్వారా మొదలైన మా జైత్రయాత్ర దుబ్బాక ద్వారా హైదరాబాద్​ ద్వారా దూసుకుపోతోంది. 2023లో గాని అంతకన్న ముందుగాని ఎన్నికలు వస్తే ఎదుర్కొవడానికి భాజపా సిద్ధంగా ఉంది.

---లక్ష్మణ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చూడండి: మంచానికే పరిమితమైన భర్త... అమ్మలా మారిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.