హైదరాబాద్‌లోని భాజపా ఆధ్వర్యంలో ఆర్టికల్ 370పై జన జాగరణ సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్‌ను 72 ఏళ్లుగా వేధిస్తోన్న సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ 72 గంటల్లో పరిష్కరించారని తెలిపారు. కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా వాయువులిచ్చామన్నారు. కాశ్మీర్ ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఆర్టికల్ 370ని రద్దు చేశామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాముడు, ఏకే.ఖాన్, చంద్రవదన్, పద్మనాభయ్య, ఐవైఆర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె