ఉద్యోగ ఖాళీలపై అధికారులు ఎందుకు లెక్కలు ఇవ్వలేకపోతున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం ఎందుకుండడంలేదని ప్రశ్నించారు.
గోవధపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందన్నారు. గోరక్షకులపై దాడులు చేస్తున్న వారిపై కేసులు కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు ఎందుకు అమలు చేయడంలేన్నారు. పోలీసులు గోవధను ఆపకపోతే భాజపా కార్యకర్తలుగా తామే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఉద్యోగ ప్రకటనలతో గత ఆరునెలలుగా ఊరిస్తున్నారు. ప్రభుత్వ మాటలపై నమ్మకం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగ వివరాలను అధికారులు ఎందుకు తీసుకురావడంలేదు. ముఖ్యమంత్రి ఆదేశాలను అధికారులు లెక్కచేయడం లేదా.. అనిపిస్తుంది. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదనిపిస్తుంది. రాష్ట్రంలో పాలన గాడితప్పింది. ఉద్యోగ ప్రకటన నీటిమీద రాతల్లానే కనిపిస్తుంది. -ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా మాజీ ఎమ్మెల్యే.
ఇదీ చూడండి: Unemployment: ప్రకటనల ఆలస్యంతో అనర్హులుగా నిరుద్యోగులు