ETV Bharat / state

BJP Deeksha: ఇందిరాపార్కు వద్ద నేడు భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష

BJP Deeksha: బడ్జెట్ సమావేశాల తొలి రోజే అసెంబ్లీ నుంచి భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం.. సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్‌ తిరస్కరించడాన్ని నిరసిస్తూ భాజపా నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు పూనుకుంది.

BJP
BJP
author img

By

Published : Mar 17, 2022, 5:03 AM IST

BJP Deeksha: బడ్జెట్ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం... సభలోకి అనుమతించే అంశం పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్‌ తిరస్కరించడాన్ని నిరసిస్తూ నేడు భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనుంది. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు దీక్ష చేయనున్నారు. వారికి మద్దతుగా ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌తో పాటు పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే.అరుణ, మురళీధర్ రావు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చోనున్నారు.

అనుమతి నిరాకరణ...

భాజపా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షకు పెద్దసంఖ్యలో శ్రేణులు తరలివస్తున్నందున శాంతిభద్రతల సమస్య వస్తుందని అందువల్ల అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీక్షచేసి తీరుతామని భాజపా స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.