హిమాయత్‌నగర్‌లో పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని భాజపా అభ్యర్థి మహాలక్ష్మి రామన్‌గౌడ్ విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి రెండు పడక గదుల ఇళ్లు అందేవిధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
కొందరు తెరాస నాయకులు ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. హిమాయత్‌నగర్ డివిజన్లో ప్రధానంగా మురికి వాడల్లో నివసించే ప్రజలకు ఇళ్లు కట్టించి ఇస్తామని వెల్లడించారు. అభివృద్ధి కావాలంటే భాజపాను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.