జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేస్తే వెంకటాపురం డివిజన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ అభ్యర్థి అభిషేక్ హామీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా భాజపా దూసుకెళ్తోందని అభిషేక్ అన్నారు.
డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అభ్యర్థి వెల్లడించారు. ఇటీవల వరదల మూలంగా నష్టపోయిన ప్రజలకు పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే వెంకటాపురం డివిజన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: తెరాస, భాజపాకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్